Janhvi Kapoor makes shocking comments on the current media
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేస్తూ వార్తలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్ గా జాన్వీ(Janhvi Kapoor) ఒక టాక్ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమె సోషల్ మీడియా, మీడియా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “నా తల్లి చనిపోయిన తరువాత ఆ విషయం గురించి మాట్లాడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే, నా తల్లి మరణాన్ని నా ఎదుగుదలకు వాడుకుంటున్నాని వార్తలు రాస్తారేమో అని. అందుకే, నాలో నేనే చాలా మధన పడ్డాను. ఆ సమయంలో నేను పడిన వేదన మాటల్లో చెప్పలేను.
Mrunal Thakur: ఆకుపచ్చ చీరలో అందాల రాశిలా.. మిలమిలా మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు
ఈ మీడియా, జర్నలిజం, సోషల్ మీడియా మానవ నైతికతను దెబ్బతీస్తున్నాయి. చనిపోయిన వారిపై కూడా మీమ్స్ వేస్తున్నారు. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. నటులు ధర్మేంద్ర చనిపోయినప్పుడు కూడా అలాంటి వార్తలే రాశారు. అది చాలా పాపం. రోజు రోజుకు పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతోంది”అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ లో పెద్ది సినిమా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అచ్చియ్యమ్మ అనే పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్ లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది జాన్వీ. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కకంపోజ్ చేసిన ఈ పాట కూడా ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.