Janhvi Kapoor recall her sweet moments with her mother sridevi
Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వికపూర్ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటివరకు హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తన అమ్మ శ్రీదేవి ఆమెను ఏమైని తిట్టేదో తెలియజేశారు.
జాన్వీ తన చిన్న వయసులో శ్రీదేవి రూమ్ లోకి వెళ్లి ఆమె లిప్ స్టిక్స్ అన్ని దొంగలించి.. జాన్వీ తన జేబుల్లో దాచుకునేదట. శ్రీదేవి వచ్చి లిప్ స్టిక్స్ కోసం జాన్వీ జేబులు చూపించమనేవారట. అప్పుడు జాన్వీ నేను చూపించాను అని జవాబు ఇచ్చేవారట. ఆ సమయంలోనే శ్రీదేవి.. ‘నా కొడక’ అంటూ తెలుగులో జాన్వీని తిట్టారట. ఈ విషయాన్ని జాన్వీ గుర్తు చేసుకుంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో అందరికి తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Srikanth : శ్రీకాంత్ కూతుర్ని చూశారా.. హీరోయిన్‌లా ఎంత అందంగా ఉందో..
Naa Kodaka… ? pic.twitter.com/dReIBc6Urw
— Imho (@Artoo_Detwo) January 3, 2024
కాగా ఇటీవల జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆ షోలో శ్రీదేవి మరణించిన సందర్భం గురించి జాన్వీ మాట్లాడుతూ.. “నేను నా గదిలో ఉన్నప్పుడు నాకు అమ్మ చనిపోయినట్లు కాల్ వచ్చింది. అది విన్న నేను ఏడవడం మొదలు పెట్టాను. అయితే ఇంతలో పక్క రూమ్ నుంచి ఖుషీ ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. నేను ఏడుస్తూనే తన దగ్గరకి వెళ్ళాను. నేను వెళ్ళగానే తాను ఏడుపు ఆపేసి నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది” అంటూ చెప్పుకొచ్చారు.
అప్పటినుంచి ఖుషీ ఇప్పటివరకు మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తాను చూడలేదని జాన్వీ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలకు ఖుషీ రియాక్ట్ అవుతూ.. “నేను చాలా స్ట్రాంగ్ ఇంటిలో వారంతా అనుకుంటారు. అందుకనే నేను కన్నీళ్లు పెట్టుకోకూడదని” గట్టిగా అనుకున్నట్లు ఆమె తెలియజేశారు.