Janhvi Kapoor: 15 ఏళ్ళ వయసులోనే.. అశ్లీల సైట్‌లో మార్ఫింగ్ ఫోటోలు.. ఆవేదన వ్యక్తం చేసిన జాన్వీ కపూర్
15 ఏళ్ళ వయసులో తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి ఆవేదన వ్యక్తం చేసిన జాన్వీ కపూర్(Janhvi Kapoor).
- V Santhosh Kumar
- Published On : April 5, 2026 / 06:55 PM IST
Janhvi kapoor sensational comments Deepfake videos
- డీప్ ఫేక్ బాధితురాలిగా జాన్వీ కపూర్
- 15 ఏళ్లకే చేదు అనుభవం
- తన వ్యక్తిగత బాధను పంచుకున్న జాన్వీ
Janhvi Kapoor: నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంతగా పురోగమిస్తుందో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు అది అంతటి ముప్పుగా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన జీవితంలోని ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు కేవలం 15 ఏళ్ల వయసున్నప్పుడు, స్కూల్ చదువుతున్న రోజుల్లోనే ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో తన మార్ఫింగ్ ఫోటోను చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు. అది తన ఫోటో కాదని, సామాజిక మాధ్యమాల్లో నైతికత కరువైందని ఆ క్షణమే ఆమెకు అర్థమైందట. ప్రస్తుతం డీప్ ఫేక్ సమస్య మరింత దారుణంగా మారిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన తన తప్పుడు చిత్రాలను కొన్ని సంస్థలు కూడా నిజమైనవిగా భావించి వాడుతుండటం తనను బాధిస్తోందని జాన్వీ పేర్కొన్నారు.
ఈ నకిలీ ఫోటోల వల్ల తన ప్రశాంతత పోవడమే కాకుండా, వృత్తిపరమైన జీవితంపై కూడా ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గొంతు ఎత్తాలని ఉన్నా, తన గొంతు అంత బలంగా వినిపిస్తుందో లేదోనన్న సందేహం తనలో ఉందని ఆమె అన్నారు. దీంతో, ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
