Janhvi Kapoor Shares Working Videos from Devara Movie Shoot Videos goes Viral
Janvi Kapoor : ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన దేవర సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 460 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా అంతా సముద్రం ఒడ్డున జరిగిన కథ కావడంతో షూటింగ్ లో చాలా భాగం సముద్రం ఒడ్డు ఉన్న లొకేషన్స్ లోనే తీశారు.
తాజాగా జాన్వీ కపూర్ దేవర షూటింగ్ సమయంలో తీసిన కొన్ని వర్కింగ్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవర సినిమాలో చుట్టమల్లే సాంగ్ థాయిలాండ్ కి వెళ్లి అక్కడ షూట్ చేసారు. జాన్వీ ఈ పాటకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది.
Also Read : Balakrishna : దసరా రోజు బాలయ్య సూపర్ హీరో అవతారం..? ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..?
జాన్వీ ఈ వీడియోలలో సముద్రపు ఒడ్డున నిల్చొని.. ఈ వీడియో నేను పోస్ట్ చేయొచ్చేమో. జెల్లీ ఫిష్ ఉన్న నీళ్ళలోకి వెళ్తున్నాను. మాములు సన్నని చీర మాత్రమే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నేను బతుకుతాను అనే అనుకుంటున్నాను. నాకు గుర్తుండిపోయే షాట్ అవ్వొచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది అంటూ సరదాగా మాట్లాడింది. అలాగే సముద్రంలో షూటింగ్ చేస్తుండగా తీసిన వీడియోలు కూడా పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలు చూస్తుంటే చుట్టమల్లే సాంగ్ థాయిలాండ్ లోని కో పాక్ బియా అనే ఐస్ లాండ్ లో షూట్ చేసినట్టు తెలుస్తుంది.