Jani Master (Photo Credit : Google)
Jani Master : ఇటీవల జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మతం మార్చుకొమ్మని పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడని ఆరోపణలు చేసింది. ఈ కేసులో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల పోలీసుల విచారణలో పాల్గొన్నారు. ఆమె చేసేవన్నీ ఆరోపణలు అని పోలీస్ కస్టడీలో తెలిపాడు.
తాజాగా జానీ మాస్టర్ బెయిల్ అప్లై చేయగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అవార్డు అందుకోవడానికి జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసారు. ఈనెల 6 నుండి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్గూడా జైల్లో ఉన్నారు.
ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో తమిళ్ లో తెరకెక్కిన ధనుష్ తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత.. సాంగ్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అవార్డు ప్రకటించారు. ఈ పాటకు జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేసారు. దీంతో ఈ ఇద్దరూ అవార్డుని అందుకోనున్నారు.