Jani Master press meet Clarity on the allegations against him
తెలుగు ప్రేక్షకులకు జానీ మాస్టర్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లోని పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. అంతేకాకుండా.. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా కొనసాగుతూ డ్యాన్సర్ల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాగా.. జానీ మాస్టర్ పై ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పలు ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను సైతం విడుదల చేశాడు. ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందించారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని అన్నారు.
తాను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కాకుండా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడగా మాట్లాడుతున్నానన్నాడు. మా యూనియన్ కోసం ఓ ప్రాంతంలో ఐదు కోట్లు పెట్టి ల్యాండ్‌ను తీసుకున్నట్లుగా చెప్పాడు. అయితే.. ఆ ల్యాండ్ సమస్యల్లో ఉందన్నాడు. జానీ మాస్టర్ అయితే పెద్దలతో మాట్లాడి తీసుకువస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి తనను ఎన్నుకున్నారన్నాడు.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు అవుతోందన్నాడు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉందన్నారు. మధ్యలో రంజాన్ వచ్చిందన్నారు. రంజాన్ సమయంలో తాను పాటలు విననని, కొరియోగ్రఫీ కూడా చేయనని, నెల రోజులు దీక్షలో ఉన్నట్లుగా చెప్పారు. ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసన తో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం. పలు పనులు చేశామన్నాడు.
Pawan Kalyan : ఫస్టు సినిమా హీరోయిన్‌ను కలిసిన డిప్యూటీ సీఎం..
ఇక సతీష్ విషయానికి వస్తే.. అయేషా చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారం కమిటీ, కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతడికి లక్ష రూపాయలు జరిమానా విధించారు. మా అసోసియేషన్‌లో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను డబ్బులు ఇచ్చాను. ఒకరి పొట్ట కొట్టాలని అనుకోను. అతడు గనుక తప్పు అయ్యిందని లెటర్ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేవాళ్ళం. ఫైన్ వేసేవాళ్ళం కాదు. నేను ఏంటో చూపిస్తానని కొందరిని బెదిరించారు. ఈ నాలుగు నెలల్లో కొన్ని పాటలు కూడా చేశారు. పైగా నా మీద ఆరోపణలు చేశారు. సతీష్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఒక్కటి నిజమైనా సరే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను ఓ చోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా ఉన్నాను. నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు. నా తరఫునుంచి తెలంగాణకు ఇబ్బంది రాకూడదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ విషయాలను చెబుతున్నాను అని జానీ మాస్టర్ అన్నారు.