Kalki Team Interview : ‘కల్కి’ మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్.. ‘కల్కి’ సినిమా గురించి ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

తాజాగా కల్కి టీమ్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.

Kalki Team Interview : ‘కల్కి’ మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్.. ‘కల్కి’ సినిమా గురించి ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

Kalki Movie Team Released Special Chit Chat Interview with Prabhas Kamal Amitabh Deepika

Kalki Team Interview : ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పలుచోట్ల కల్కి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. తాజాగా కల్కి టీమ్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కల్కి సినిమా గురించి అందరూ ఆసక్తికర విషయాలు తెలియచేసారు.

ఈ స్పెషల్ చిట్ చాట్ ని అమితాబ్ మొదలుపెట్టారు. ముందుగా కల్కినిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లను అభినందించి వారిని సినిమా కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఎలా మొదలుపెట్టారు ఈ ప్రాజెక్టు? నాగి మీకు ఏం చెప్పాడు అని అడిగారు.

దానికి స్వప్న దత్, ప్రియాంక దత్ మాట్లాడుతూ.. మేము ఎప్పట్నుంచో కలిసి పనిచేస్తున్నాము. మహానటి అయ్యాక ఒకరోజు ఈ సినిమా లైన్ చెప్పాడు. ఈ కథ ఐడియా చెప్పాక మేము ఆశ్చర్యపోయాము. అప్పుడు ఈ సినిమాకు ఏం కావాలి, ఇందులో ఎంత డెప్త్ ఉందని మాకు అర్ధం కాలేదు. మొదలుపెట్టాక చాలా ఆసక్తిగా మారింది. అసలు మేమొక్కరమే ఈ సినిమా తీయగలమా అనుకున్నాం. మీలాంటి పెద్ద స్టార్స్ అంతా కావాలని భావించాం. ఈ కథ విన్నాక కొన్ని రోజులు నిద్రపట్టలేదు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము. మహానటి కోసం ఒక సంవత్సరం కష్టపడ్డాము. కానీ ఈ సినిమా కోసం నాలుగేళ్లు కష్టపడ్డాము. మా ఫ్యామిలీ అంతా సినిమా వాళ్లే కాబట్టి ఇంట్లో కూడా సినిమా గురించే మాట్లాడేవాళ్ళం. నాగ్ అశ్విన్ హార్డ్ వర్క్, మీ లాంటి స్టార్స్, ప్రభాస్ వల్ల ఈ సినిమా సాధ్యమైంది అని తెలిపారు.

Also Read : Balakrishna : ప్రజల కోసం బాలయ్య.. త్వరలో ఏపీలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్..

అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. అసలు ఇలాంటి విజువల్స్ ఎక్కడా చూడలేదు. చాలా కొత్తగా ఉంటాయి. నాగి నన్ను కలవడానికి వచ్చినప్పుడు కేవలం పిక్చర్స్ తీసుకొచ్చి చెప్పాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ని కొట్టే సీన్స్ ఉన్నాయి. నా లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ 3 గంటలు పట్టేది వేసుకోడానికి. తీయడానికి రెండు గంటలు పట్టేది. చాలా పెయిన్ వచ్చేది. కానీ సినిమా విజువల్స్ చూస్తే ఇంత చేయడం తప్పులేదు అనిపించేది. ఆ మేకప్ వేసేటప్పుడు ఎటు తిరగకుండా కూర్చోవాలి. సినిమా కోసం కష్టం తప్పదు. అదంతా సినిమాలో కనిపిస్తుంది అని అన్నారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. చాలా మంది ఇలాగే పెద్ద పెద్ద స్కెచ్ లు గీసుకొని వస్తారు. నాగి కూడా నా దగ్గరికి అలాగే కథని తీసుకొచ్చాడు. పేపర్ మీద ఓకే ఇదంతా ఎలా చూపిస్తావు అని అడిగాను. దాంతో నాగి అప్పటికే మీ లుక్ టెస్ట్ వీడియోలు చూపించాడు. అంతే నేను సైలెంట్ అయిపోయాను. నా క్యారెక్టర్ కూడా అలా గీసుకొని వచ్చాడు అని అన్నారు.

దీపికా పదుకోన్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారితో షూట్ చేసినప్పుడు నాగి నాకు కాల్ చేసి ఫస్ట్ డే కమల్ గారితో షూట్ చేశాను అని చాలా ఆనందంగా చిన్నపిల్లాడిలా తెలిపాడు అని చెప్పింది.

అమితాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ నువ్వెప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటావు. కానీ నీ ఫ్యాన్స్, నీ స్టేటస్ చాలా పెద్దది. ప్రభాస్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు కాళ్లకు దండం పెట్టాడు, ఆలా చేయొద్దు అని చెప్పాను. కానీ అదే రిపీట్ చేసేవాడు. ఒక రోజు నాతో సర్ నేను బాహుబలి లాంటి యాక్షన్ సినిమాలు చేశాను, నాతో ఫైట్ సీన్స్ ఉన్నాయి బోన్స్ విరిగిపోతాయి ముందే ప్రిపేర్ గా ఉండండి అని సరదాగా అన్నాడని తెలిపారు.

Also Read : Allu Aravind : టికెట్ రేట్ల‌ కంటే పెద్ద స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి.. డిప్యూటీ సీఎంతో మీటింగ్ త‌రువాత అల్లు అర‌వింద్ కామెంట్స్‌..

అమితాబ్ నిర్మాత అశ్విని దత్ గురించి స్వప్న, ప్రియాంకలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ఆయన చాలా సింపుల్ పర్సన్. ప్రతిరోజు సెట్ లో ఉండేవాళ్ళు. నేను అది చేయాలి. అది చేయకూడదు అని ఉండదు. చాలా మంచి పర్సన్ అని చెప్పారు.

కమల్ హాసన్ షూటింగ్ సెట్స్ గురించి మాట్లాడుతూ.. చాలా సినిమా సెట్స్ గోల గోలగా ఉంటాయి. కానీ కల్కి సెట్స్ లో చాలా సైలెంట్ గా ఉండేది. నాగి అలా అందర్నీ మెయింటైన్ చేసాడు. అలాంటి గోల మన మనసులో, థియేటర్స్ లో ఉండాలి కానీ షూటింగ్ సెట్స్ లో కాదు అని అన్నారు.

అమితాబ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము యాక్షన్ సీన్స్ కోసం పై నుంచి దూకేవాళ్ళం, చాలా చేసేవాళ్ళం. బోన్స్ కూడా విరగ్గొట్టుకున్నం. కానీ ఇప్పుడు టెక్నాలజీతో అంత కష్టపడట్లేదు. మా అప్పుడు ఇంత టెక్నాలజీ, ఫెసిలిటీలు లేవు. అప్పట్లో ఫిలింతో షూట్ చేసేవాళ్ళు. అది చాలా ఖరీదు. ఇప్పుడు అంతా డిజిటల్. అప్పట్లో ఫిలిం సేవ్ చేయడానికి ఫస్ట్ షాట్ లోనే బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు విజువల్స్ చూసాకా చాలా ఆశ్చర్యపోయాను. నాగి విజన్ చాలా అద్భుతం అని అన్నారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. ఫస్ట్ అమితాబ్ గారితో నాకు ఫైట్ సీన్ పెట్టారు. పెద్దాయన జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. కానీ ఆయన నన్ను గట్టిగా కొట్టడంతో నేను అనుకున్నట్టు కాదు అమితాబ్ గారు ఇంకా యంగ్. మీరు చాలా బలంగా ఉన్నారు అని ఆయనకు చెప్పానని తెలిపారు.

Also Read : Pawan Kalyan : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినీ నిర్మాత‌ల భేటీ

దీపికా మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఒక సిటీని సెట్ గా వేశాము. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సెట్ ని అందరూ చూస్తే బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో ప్రపంచ సినీ పరిశ్రమలో వాడే చాలా టెక్నాలిజీలు వాడారు. డైరెక్టర్ దాన్ని పర్ఫెక్ట్ గా వాడారు. కల్కి వరల్డ్ నాకు, ఆడియన్స్ కు కొత్త. భాష కంటే ముందు సినిమా ఉంటుంది. ఏ భాషలో నటించినా ఎమోషన్ తో నటించడం ఇంపార్టెంట్. ఇదొక ఎమోషనల్ జర్నీ అని తెలిపింది.

స్వప్న దత్ మాట్లాడుతూ.. అంతా నాగి మైండ్ లో ఉండేది. ఒక్కోసారి అసలు ఇవాళ ఏం షూట్ చేస్తున్నాం అని మేము కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. CG షాట్స్ చూసాక, విజువల్స్ చూసాక నాగి మైండ్ లో చాలా ఉంది అనుకునే వాళ్ళం. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమా చేయకపోతే ఇంకెప్పుడు చేయలేము. ఇప్పుడు ఇండియాకు ఇలాంటి సినిమా కావాలి అని చెప్పేవాడు. నాగ్ అశ్విన్ ఫస్ట్ సినిమా ప్రభాస్ తో చేయాలి కానీ కుదరలేదు అని తెలిపింది.

అమితాబ్ మాట్లాడుతూ.. మైథలాజిని, సైన్స్ ని మిక్స్ చేసి తీయడం చాలా యూనిక్. ఇలాంటి కథని తీసుకురావడం చాలా ఈజీ కాదు. బుజ్జి వెహికల్ చేయడం నమ్మలేకపోయాను. సౌత్ లో ఒక మంచి డిసిప్లేన్ ఉంటుంది. సెట్స్ లో, ఆర్టిస్ట్ ల మధ్య ఒక క్రమశిక్షణ ఉంటుంది. సినిమా చూశాక ఒక ఇండియన్ సినిమా, మన కల్చర్ సినిమా అనిపిస్తుంది. కల్కి సినిమా చూసాక ప్రేక్షకులు షాక్ అవుతారు అని అన్నారు.

Also Read : Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..

ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సూపర్ హీరోలాగా నెగిటివ్ షేడ్స్, కొంచెం ఫన్నీ క్యారెక్టర్ గా చేసాను. కామెడీ బాహుబలి ముందు చేశాను కానీ బాహుబలి తర్వాత ఇదే మళ్ళీ చేయడం. నా పాత్రని బాగా రాసాడు. నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ ఇదే అని అన్నాడు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను గతంలో కూడా కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ చేశాను కానీ ఇది డిఫరెంట్. ఈ సినిమా ఒక నేషనల్ ఫ్లాగ్ లాంటిది. ఇందులో దేశం నలుమూల నుంచి నటీనటులు ఉన్నారు. కల్కి సినిమాని ప్రేక్షకులు సొంతం చేసుకుంటారు అని తెలిపారు.