Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..

సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ పెళ్లి నిన్న జూన్ 23న జరిగింది.

Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..

Bollywood Actress Sonakshi Sinha Emotional post on her Marriage with Zaheer Iqbal

Sonakshi Sinha : బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురు, హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ గత కొన్నేళ్లుగా నటుడు జహీర్ ఇక్బల్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఓ సినిమాలో కూడా కలిసి నటించారు. సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ పెళ్లి నిన్న జూన్ 23న జరిగింది.

అయితే ఇద్దరూ వేరువేరు మతాలు కావడంతో పెళ్లిని రిజిస్టర్ మ్యారేజీలా చేసుకొని రిసెప్షన్ వేడుకలు గ్రాండ్ గా చేసుకున్నారు. వీరి రిసెప్షన్, పెళ్లి వేడుకల ఫోటోలు బయటకు రాగా పలువురు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Pawan Kalyan : పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. అగ్ర నిర్మాత ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

సోనాక్షి సిన్హా తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇదే రోజు ఏడేళ్ల క్రితం 2017 జూన్ 23న ఒకరికొకరు మా కళ్ళల్లో నిజమైన ప్రేమను చూసి జీవితాంతం అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఎన్నో బాధలు, కష్టాలు దాటుకొని ఆ ప్రేమ ఇవాళ ఇక్కడికి చేరుకుంది. మా పేరెంట్స్, దేవుళ్ళ ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఇప్పుడు మేము భార్యాభర్తలం అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఇక సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)