Pawan Kalyan : పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. అగ్ర నిర్మాత ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

పవన్ కళ్యాణ్ గెలిచినందుకు నిన్న జూన్ 23 రాత్రి హైదరాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Pawan Kalyan : పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. అగ్ర నిర్మాత ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

Pawan Kalyan Winning Celebrations in Tollywood by Top Producer TG Vishwaprasad

Pawan Kalyan Winning Celebrations : ఏపీలో ఇటీవల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భారీగా గెలవడంతో అభిమానులు, కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఫుల్ సంతోషంలో ఉంది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. వీరితో పాటు పలువురు సినీ పరిశ్రమకు సన్నిహితంగా ఉండే నాయకులు కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో సినీ పరిశ్రమలో ఆనందం నెలకొంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి సినీ పరిశ్రమలో అనేక మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్, కూటమి గెలిచినందుకు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. TG విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 100 సినిమాలు చేయాలి అనే టార్గెట్ తో సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అనేక హిట్స్ కొట్టిన విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ సినిమా కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కి విశ్వప్రసాద్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కు అండగా ఉంటారు ఈ నిర్మాత.

Also Read : Nagarjuna : ఓ పెద్దాయనను తోసేసిన నాగార్జున బాడీగార్డ్.. ట్విట్టర్లో క్షమాపణలు చెప్పిన నాగ్..

దీంతో పవన్ కళ్యాణ్ గెలిచినందుకు నిన్న జూన్ 23 రాత్రి హైదరాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి డైరెక్టర్ మారుతి, శ్రీవాస్, శ్రీరామ్ ఆదిత్య, హీరో తేజ సజ్జా, నిర్మాత SKN, దామోదర ప్రసాద్, బాలాదిత్య, సప్తగిరి, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ.. ఇలా చాలా మంది నటీనటులు, సింగర్స్ వచ్చారు. పవన్ కళ్యాణ్ పాటలపై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు, లైవ్ సాంగ్ పర్ఫార్మెన్స్ లు నిర్వహించారు. అనేకమంది సెలబ్రెటీలు మాట్లాడారు. అలాగే ఈ సెలబ్రేషన్స్ కి అనేకమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. వచ్చిన అందరికి భోజనాలు పెట్టి మరీ పంపించారు.

Pawan Kalyan Winning Celebrations in Tollywood by Top Producer TG Vishwaprasad

చాలా భారీగా ఈ సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఓ సినిమా ఈవెంట్ లా పొలిటికల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి అని అంతా ఆశ్చర్యపోయారు. మొత్తానికి పవన్ విజయం సినీ పరిశ్రమలో ఓ కొత్త ఊపుని తీసుకొచ్చింది.

Pawan Kalyan Winning Celebrations in Tollywood by Top Producer TG Vishwaprasad