×
Ad

Dhee Dance Show : జీవితాలతో ఆడుకుంటారా.. కంటెస్టెంట్ పై జానీ మాస్టర్ సీరియస్.. ఢీ ప్రోమో చూశారా..

ఢీ కంటెస్టెంట్ పై ఫైర్ అయిన జానీ మాస్టర్. ఒకరి జీవితాలతో ఒకరు ఆడుకుంటారా..?

  • Published On : April 14, 2024 / 11:58 AM IST

Jani Master serious on Dhee Celebrity Special episode

Dhee Dance Show : బుల్లితెర సూపర్ హిట్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి వారం ఆడియన్స్ ని ఎంతో ఎంటర్టైన్ చేస్తూ సూపర్ వ్యూస్ అందుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ లో నువ్వా నేనా అంటూ పొటపడే కంటెస్టెంట్స్.. పండగల సమయంలో ఆడియన్స్ ని అలరించేలా డాన్స్ చేస్తూ అదరగొడుతుంటారు. ఈక్రమంలోనే శ్రీరామనవమి సందర్భంగా కంటెస్టెంట్స్ అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇచ్చారు.

కాగా ఈ ఎపిసోడ్ కేవలం పండుగ స్పెషల్ ఎపిసోడ్ మాత్రమే కాదు, ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా అవ్వడంతో కంటెస్టెంట్స్ నుంచి ఆడియెన్స్‌‌ వరకు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎపిసోడ్ కి జానీ మాస్టర్ కూడా జడ్జిగా వ్యవహరించారు. ఇక ఓటింగ్ సమయంలో ఒక కంటెస్టెంట్ ఓటింగ్ చేసిన పద్ధతి గురించి జానీ మాస్టర్ ప్రశ్నించగా, ఆ కంటెస్టెంట్ బదులిస్తూ.. మరో కంటెస్టెంట్ చెప్పడం వలనే తాను అలా ఓట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Also read : Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్..

ఇక ఈ సమాధానం విన్న జానీ మాస్టర్ కంటెస్టెంట్ పై సీరియస్ అయ్యారు. ఎవరో చెప్పారని ఓటు వెయ్యడం ఏంటి..? ఢీ డాన్స్ షో అంటే ఏం అనుకుంటున్నారు..? ఇవి మీ జీవితాలు..? ఒకరి జీవితాలతో ఒకరు ఆడుకుంటారా..? అంటూ కంటెస్టెంట్స్ అందరి పై గట్టిగా ఫైర్ అయ్యారు. దీంతో స్పెషల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా మారింది. మరి ఈ వీక్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=lz314tLhps8