Takashi Yamazaki : ఆస్కార్ విన్నింగ్ ‘ఓపెన్ హైమర్’ సినిమాకు కౌంటర్ సినిమా తీస్తానంటున్న జపాన్ స్టార్ డైరెక్టర్

జపాన్ పై వేసిన అణుబాంబు తయారీ, అది చేసిన ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఓపెన్ హైమర్' సినిమాని తెరకెక్కించగా

Japan Director Takashi Yamazaki wants to do Counter Movie to Christopher Nolan Oppenheimer

Takashi Yamazaki : హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో ప్రపంచయుద్ధంలో జపాన్ పై వేసిన అణుబాంబు తయారీ, అది చేసిన ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఓపెన్ హైమర్'(Oppenheimer) సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అయి 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

అయితే రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులు వేయగా ఆ పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. ఈ ఘటనలో ఎంతోమంది చనిపోయారు. ఇంకెంతోమంది అణుబాంబు నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల గుర్తుతెలియని రోగాలతో చాలా సంవత్సరాలు బాధపడ్డారు. ఇప్పటికి జపాన్ ఈ విషాదాన్ని మరిచిపోలేదు. ఇటీవల మళ్ళీ ఓపెన్ హైమర్ సినిమాతో జపాన్ మర్చిపోతున్న గాయాన్ని గుర్తుచేశారు.

Also Read : RC 17 : సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి తనయుడి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ వినగానే 5 నిముషాల పాటు..

దీంతో జపాన్ స్టార్ డైరెక్టర్ తకాషి యమజాకి ఓపెన్ హైమర్ సినిమాకు కౌంటర్ గా సినిమాని చేస్తానని ప్రకటించాడు. విజువల్ ఎఫెక్ట్స్ తో కెరీర్ మొదలుపెట్టిన తకాషి యమజాకి డైరెక్టర్ గా జపాన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాడు. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ అవార్డులు గెలుచుకోగా తాను తీసిన గాడ్జిల్లా మైనస్ 1 సినిమాకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇటీవల జపాన్ మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ హైమర్ సినిమాకు కౌంటర్ ఇచ్చేవిధంగా సినిమా చేస్తానని ప్రకటించాడు. ఓపెన్ హైమర్ సినిమా చేసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తకాషి యమజాకి చేసిన గాడ్జిల్లా మైనస్ 1 సినిమాని ఆస్కార్ సమయంలో పొగడటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు