RC 17 : సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి తనయుడి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ వినగానే 5 నిముషాల పాటు..

తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ RC17 సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసాడు.

RC 17 : సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి తనయుడి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ వినగానే 5 నిముషాల పాటు..

Rajamouli on SS Karthikeya Interesting Comments on Ram Charan Sukumar RC 17 Movie

RC 17 Movie : సుకుమార్(Sukumar) ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న సుకుమార్ – రామ్ చరణ్(Ram Charan) కాంబోలో RC17 సినిమా ప్రకటించారు. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మళ్ళీ రాబోతుంది. చరణ్ గేమ్ ఛేంజర్, RC16 సినిమాలు అయ్యాక ఈ సినిమా ఉండబోతుంది. అధికారికంగా నిన్న అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయగా పోస్టర్ పై ‘జయించడానికి గర్జిస్తున్నాడు’ అనే అర్ధం వచ్చేలా రాసి రెండు గుర్రం బొమ్మలు కూడా వేశారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

అయితే గతంలో RRR సినిమా సమయంలోనే రాజమౌళి.. సుకుమార్ – చరణ్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యలు చేయగా అవి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ RC17 సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసాడు.

Also Read : Celebrities Holi Photos : టాలీవుడ్ టు బాలీవుడ్.. సెలబ్రిటీస్ హోలీ సెలబ్రేషన్ ఫోటోలు..

కార్తికేయ తన ట్వీట్ లో.. RRR సినిమా క్లైమాక్స్ షూట్ సమయంలో రామ్ చరణ్ సరదాగా సుకుమార్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది వినగానే అయిదు నిమిషాల పాటు షాక్ కి గురయ్యాను. చరణ్ ఆ స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించేసుకున్నాను. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఒక ఐకానిక్ సీక్వెన్స్ లా నిలిచిపోతుంది. ఇంతకంటే నేను ఎక్కువ లీక్ చేయను అంటూ చరణ్ ని ట్యాగ్ చేసాడు. దీంతో కార్తికేయ చేసిన ట్వీట్ వైరల్ గా మారయింది. సినిమా మొదలవ్వకముందే రాజమౌళి, కార్తికేయ.. ఇలా సినిమా గురించి మాట్లాడటంతో ఇప్పటినుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.