Prabhas Fans : జపాన్‌లో ప్రభాస్ అభిమానుల హంగామా.. ప్రభాస్‌కి ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి..

జపాన్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఒక రూమ్ నిండా ప్రభాస్ బొమ్మలు, కటౌట్స్ పెట్టి పూలతో డెకరేట్ చేసి, ప్రభాస్ కటౌట్స్ కి దండలు వేసి, ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి మరీ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Prabhas Fans : బాహుబలి(Bahubali) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచేసి ఇండియన్ సినిమాగా మార్చేశాడు ప్రభాస్. తెలుగు సినిమాలకు ఇండియా అంతటా, విదేశాల్లో మరింత పెద్ద మార్కెట్ ఏర్పడేలా చేసాడు ప్రభాస్(Prabhas). ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ కటౌట్ చూసి అందరూ అభిమానులు అయిపోయారు. ఇండియాలోనే కాక జపాన్, మలేషియా, సింగపూర్.. పలు దేశాల్లో ప్రభాస్ కి భారీగా అభిమానులు ఏర్పడ్డారు.

ఇక సాహో(Saaho) సినిమాతో జపాన్(Japan) లో ప్రభాస్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ పేరుతో అక్కడ చాకోలెట్స్, షాప్స్, ప్రోడక్ట్స్, బొమ్మలు ఇలా చాలా అమ్మేవాళ్ళు. తాజాగా జపాన్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడి ఫ్యాన్స్ కంటే రెచ్చిపోయి మరీ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు(Prabhas Birthday) కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక పలువురు అభిమానులు ప్రభాస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

Also Read : Prabhas Birthday : ఇది ప్రభాస్ కథ మాత్రమే కాదు.. తెలుగు సినిమా కథ కూడా..

జపాన్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఒక రూమ్ నిండా ప్రభాస్ బొమ్మలు, కటౌట్స్ పెట్టి పూలతో డెకరేట్ చేసి, ప్రభాస్ కటౌట్స్ కి దండలు వేసి, ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి మరీ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ప్రసాదాల్లో మన పులిహార, గారెలు, పరవాన్నం.. లాంటివి పెట్టడం విశేషం. అనంతరం అందరూ కలిసి కూర్చొని భోజనాలు కూడా చేశారు. దీంతో జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పనిని చూసి ఇక్కడ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. వీళ్లెంట్ర బాబు మనకంటే డై హార్డ్ ఫ్యాన్స్ లాగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జపాన్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ట్రెండింగ్ వార్తలు