Japanese fans letter to Jr. NTR
NTR: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపించేందుకు సిద్దమవుతుంది.
RRR : ఫ్యామిలీలతో కలిసి జపాన్ చెక్కేసిన ఎన్టీఆర్, చరణ్.. అక్కడ కూడా హిట్ కొట్టడానికి రెడీ..
ఇక ఈ నెల 21న జపాన్ లో రిలీజ్ అవుతుండడంతో, మూవీ టీం ప్రమోషన్స్ కోసం డ్రాగన్ దేశానికీ పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫామిలీతో సహా అక్కడకి చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా జపాన్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానం తెలుపుతూ లేఖని అందజేశారు.
తారక్ బస చేస్తున్న హోటల్ లో పని చేసే ఒక వెయిటర్ ఈ లేఖను ప్రెజంట్ చేసింది. ఈ లెటర్ లో తనతో పాటు మరికొంతమంది అభిమానులు.. “డియర్ ఎన్టీఆర్” అంటూ రాసుకొస్తూ వారి ప్రేమని తెలియజేసారు. తారక్ కూడా ఆ లేఖను ప్రేమతో స్వీకరించి, వారితో కొంత సమయం సంభాషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.
#JrNTR with his #Japan Fans ❤#Japanese #NTRJr #NTR #NTRInJapan #NTRtoNTR #ramcharan #ntr #jrntr #rrr #rrrmovie #rajamouli pic.twitter.com/22X6fWzSWY
— PRAJA TV ? (@prajatvv) October 19, 2022