RRR : ఫ్యామిలీలతో కలిసి జపాన్ చెక్కేసిన ఎన్టీఆర్, చరణ్.. అక్కడ కూడా హిట్ కొట్టడానికి రెడీ..
RRR సినిమా ప్రపంచంలోని చాలా దేశాల్లో రిలీజ్ అయింది. మరిన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా RRR సినిమాని ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు. జపాన్ లో కూడా..............

Charan and NTR went to Japan for RRR Movie Promotions
RRR : రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా భారీ విజయం సాధించిందని మన అందరికి తెలిసిందే. దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది RRR సినిమా. ఇక ఈ సినిమాని చూసి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు అందరూ అభినందించారు. ఈ సినిమాని ఆస్కార్ కి కూడా జనరల్ కేటగిరిలో పంపించారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళికి మరింత స్టార్ డమ్ వచ్చింది.
ఇక RRR సినిమా ప్రపంచంలోని చాలా దేశాల్లో రిలీజ్ అయింది. మరిన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా RRR సినిమాని ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు. జపాన్ లో కూడా తెలుగు సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. గతంలో బాహుబలి, సాహో సినిమాలు అక్కడ కూడా బాగా ఆడాయి. దీంతో RRR సినిమాని కూడా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం చరణ్, ఎన్టీఆర్ మంగళవారం జపాన్ కి బయలుదేరారు.
BiggBoss 6 Day 44 : ఇష్టం లేకపోతే హౌజ్ నుంచి వెళ్లిపోండి.. కంటెస్టెంట్స్ మీద సీరియస్ అయిన బిగ్‌బాస్
చరణ్ ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ ప్రణతి, పిల్లలతో కలిసి ఫ్యామిలీలతో జపాన్ బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ లో అభిమానులు వీరి ఫోటోలు తీయగా అవి వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి అక్కడ్నుంచి డైరెక్ట్ గా జపాన్ వెళ్తారని సమాచారం. జపాన్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించడానికి రెడీగా ఉంది.