Animal Movie : ‘యానిమల్‌’పై జయప్రకాశ్ నారాయణ్ కామెంట్స్.. సినిమా మేకర్స్‌కి భాద్యత ఉండాలి..

'యానిమల్‌' సినిమా పై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ కామెంట్స్ చేశారు. సినిమా మేకర్స్‌కి భాద్యత ఉండాలి అంటూ..

Jaya Prakash Narayana comments about Ranbir Kapoor Sandeep Reddy Vanga Animal Movie

Animal Movie : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన సినిమా ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో పోషించారు. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. అయితే ఈ మూవీ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. యూత్ పై చెడు ప్రభావం చూపేలా సినిమా ఉందంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్లమెంట్ లో కూడా ఓ ఎంపీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మేకర్స్ ని తప్పుబడ్డారు. తాజాగా ఈ మూవీ గురించి రాజకీయనాయకుడు, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ కామెంట్స్ చేశారు. “సినిమాల వల్ల మనుషులు మారిపోరు, చెడిపోరు. కానీ వారి ఆలోచన విధానం పై మాత్రం ప్రభావితం చూపుతాయి. సినిమా మేకర్స్ కి కూడా సమాజం పట్ల భాద్యత ఉండాలి. మంచి ఆలోచనలు కలిగేలా చేయకపోయినా పర్వాలేదు. చెడు ఆలోచనలు కలిగేలా సినిమాలు తెరకెక్కించకుండా ఉంటే బాగుటుంది” అని పేర్కొన్నారు.

Also read : Prabhas Maruthi : ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?

“సమాజంలో జరిగే తప్పులకు పూర్తి భాద్యత సినిమాలు అనడం లేదు. అలా అనడం కూడా తప్పు. కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం సమాజం పై భాద్యత వహించి సినిమాలు తీస్తే బాగుటుంది. స్వతంత్ర పోరాటంలో అలా సినిమా తీసేవారు. శివ, యానిమల్ లాంటి సినిమాలు చూస్తే.. నాకే ఎదుటవాడిని చంపేయాలనే భావన కలుగుతుంది. చిన్న పిల్లల్లో ఆ సినిమాలు మరింత ప్రభావం చూపిస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కించాలి” అని చెప్పుకొచ్చారు.