×
Ad

100 Days Love Story : 100 డేస్ లవ్ స్టోరీ.. ‘అతి ప్రేమ భయానకం..’ రిలీజ్ ఎప్పుడంటే..?

జయ శివ సూర్య , నిఖిత శ్రీ, ఇషామనోహరి ప్రియ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం '100 డేస్ లవ్ స్టోరీ'(100 Days Love Story)

100 Days Love Story movie release date fix

100 Days Love Story : జయ శివ సూర్య , నిఖిత శ్రీ, ఇషామనోహరి ప్రియ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం అనేది ట్యాగ్ లైన్‌. విజయమిత్ర ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి పురిపండా వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.

Purushaha : పురుష: మూవీ నుంచి ‘చాటు చాటు’ లిరికల్ సాంగ్ విడుద‌ల‌

Pawan Kalyan : రాజమౌళి నెక్స్ట్ మూవీ పవన్ కల్యాణ్‌తో..?

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ప్రేమ కథా చిత్రాల్లో ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. దర్శకుడు విజయమిత్ర అద్భుతంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌న్నారు. ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా ఈ చిత్రం ఆక‌ట్టుకుంటుంద‌న్నారు.