2019 డిసెంబర్ 5న స్వర్గీయ జయలలిత మూడో వర్థంతి సందర్భంగా ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం..
జయలలిత.. సినీ నటిగా, పార్టీ అధినేత్రిగా, ఆరుసార్లు ముఖ్యమంత్రిగా, ఐరన్ లేడీగా… జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు.
గతకొద్ది కాలంగా పలు భాషల్లో జయలలిత జీవితాన్ని సినిమాగా తెరెక్కికంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. డిసెంబర్ 5న జయలలిత మూడో వర్థంతి సందర్భంగా ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమా తెరకెక్కతుంది.
ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వరలక్ష్మీ శరత్ కుమార్ జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించనుంది. కంగానా రనౌత్ జయలలితగా ‘తలైవి’ అనే సినిమా తెరకెక్కుతుంది.
ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు (ఎంజీఆర్) ఎం.జి.రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు. అయితే సినిమాలో మరో ముఖ్యపాత్ర అయిన శోభన్ బాబు పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.
పురచ్చితలైవి జీవితాన్ని కథాంశంగా ఎంచుకుని బయోపిక్‌లు రెడీ అవుతుండగా, తాజాగా వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. గౌతమ్ మీనర్ డైరెక్ట్ చేస్తోన్నఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా జయలలిత పాత్రలో ఉన్న రమ్యకృష్ణను లుక్‌ను రిలీజ్ చేసారు.
ఈ లుక్‌లో రమ్యకృష్ణ అచ్చు జయలలితలానే ఉంది.ఈ విధంగా బయోపిక్స్ రూపంలో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు సినీ వర్గాల వారు. ఈ సినిమాలు పలు భాషల్లో విడుదల కానున్నాయి. #Ammaforever అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఆమెకు నివాళులర్పిస్తున్నారు ప్రజలు.
భౌతికంగా జయలలిత మన మధ్య లేకపోయినా ఆమె నటించిన సినిమాలలోని పాత్రల రూపంలో, రాజకీయాలపై చెరగని ముద్ర వేసి, అమ్మా అని పిలిపించుకున్న తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.