Jayam Ravi requested director S.J. Suryah to make a film with Pawan Kalyan.
Pawan Kalyan: ఖుషి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్ జె సూర్య కాంబోలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ప్రెజెంట్ జనరేషన్ మాటల్లో చెప్పాలంటే ఇది కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. స్టోరీ, ఎమోషన్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్(Pawan Kalyan), భూమిక క్యూట్ నెస్, ఎస్ జె సూర్య టేకింగ్, మణిశర్మ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ వెరసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశాయి.
ఇక ఈ సినిమా తరువాత మళ్ళీ అలాంటి సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తాను అంటూ ఎస్ జె సూర్య సూర్య కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా సార్లు దర్శకుడు ఎస్ జె సూర్యను రిక్వెస్ట్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ లిస్టులో తమిళ స్టార్ జయం రవి. మీ ఇద్దరు(పవన్ కళ్యాణ్- ఎస్ జె సూర్య) కలిసి మళ్ళీ సినిమా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.
Nidhi Agarwal: ప్రభాస్ పట్టించుకోలేదు.. ఆయన అలాంటి వ్యక్తి కాదు.. నిధి షాకింగ్ కామెంట్స్
ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నుంచి టైగర్ అఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును స్వీకరించిన విషయం తెలిసిందే. అందుకు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ ఎస్ జె సూర్య. ఆ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన హీరో జయం రవి.. ‘మీ కాంబోలో మరో సినిమా రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాము’ అంటూ రాసుకొచ్చాడు.
దీంతో, జయం రవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయుండి మరో హీరో సినిమా కోసం ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ తో మరో ఖుషి లాంటి సినిమా ప్లాన్ చేయాలంటూ ఎస్ జె సూర్య ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
We all wish to see this combo again in the big screen sir ❤️ https://t.co/CISqM2iM1W
— Ravi Mohan (@iam_RaviMohan) January 20, 2026