Jayasudha emotional while sharing about his husband
Jayasudha : బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.
ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే వాళ్ళ పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలని గుర్తు చేసుకొని బాధపడ్డారు.
Unstoppable : కాంట్రవర్సీ ప్రశ్నలకి అదిరిపోయే సమాధానాలు ఇచ్చిన ముగ్గురు భామలు..
జయసుధ మాట్లాడుతూ.. నా భర్త అయిదేళ్ల క్రితం చనిపోయారు. ఒక భార్యకి భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికి తెలిసిందే. నా భర్త చనిపోయినప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు. నేను అప్పుడు వేరే చోట ఉన్నాను. నా పిల్లలు బాలకృష్ణకి చెప్పి అమ్మకి అప్పుడే చెప్పొద్దు అని చెప్పారు. నా భర్త, బాలయ్య బాగా క్లోజ్. వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి క్లోజ్. ఇద్దరు కలిసి క్రికెట్ కూడా ఆడుకునే వారు. ఆ సమయంలో బాల నాకు సపోర్ట్ గా నిలిచారు. జయప్రద కూడా ఆ టైంలో నా పక్కనే ఉండి సపోర్ట్ చేసింది. నా పెళ్ళికి జయప్రద ఉంది, నా భర్త చనిపోయినప్పుడు ఉంది అని చెప్తూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.