Jayasudha gave clarity on the third marriage
Jayasudha : చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటి ‘జయసుధ’. సహజనటి అనే ట్యాగ్ ని సంపాదించుకున్న జయసుధ తెలుగు సినిమాలతో వెండితెరకు పరిచమై తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోను నటించింది. ఎక్కువుగా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ పక్కన నటించిన జయసుధ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు పోషిస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి తమిళ సినిమా ‘వరిసు’లో విజయ్ కి తల్లిగా నటించింది. కాగా జయసుధ గురించి ఫిలిం వర్గాల్లో ఒక వైరల్ న్యూస్ వినిపిస్తుంది.
Jayasudha : నా భర్త చనిపోయినప్పుడు నాకు ఎవ్వరూ చెప్పలేదు..
దీని పై జయసుధ స్పందించింది. జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త కొన్ని రోజులుగా వినిపిస్తుంది. గతంలో జయసుధ ఒక వ్యాపారవేత్తని వివాహం చేసుకొని, విభేదాలతో విడిపోయింది. ఆ తరువాత బాలీవుడ్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ని రెండో వివాహం చేసుకుంది. అయితే అతను అనారోగ్య కారణాల వల్ల 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జయసుధ.. ఈ మధ్య ఎక్కడ కనిపించినా, ఆమె వెంట ఒక అమెరికన్ వ్యక్తి ఉంటున్నాడు.
దీంతో జయసుధ, అతనిని రహస్యంగా వివాహం చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఆమె వరకు చేరడంతో జయసుధ క్లారిటీ ఇచ్చింది.. అతను నా బయోపిక్ తీయడానికి అమెరికా నుంచి వచ్చాడు. స్పిరిచ్యువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను? అంతకు ముందు నా లైఫ్ ఎలా ఉండేది? ప్రస్తుతం నా లైఫ్ అండ్ కెరీర్ ఎలా ఉంది? అనే దాని మీద పరిశోధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి నాతో ప్రయాణిస్తూ వస్తున్నాడు. అంతకు మించి ఏమి లేదు అంటూ తెలియజేసింది. దీంతో జయసుధ పెళ్లి వార్తలకు చెక్ పడింది.