Jio Studios announces Bhediya and Stree sequels
Bhediya – Stree : ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే, దాని క్రేజ్ దృష్ట్యా సీక్వెల్ తీసుకు వచ్చే ఆలోచన చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఇటీవల కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ కూడా ఎక్కువ అయ్యిపోయింది. సినిమా జస్ట్ హిట్ అనిపించుకున్నా చాలు సీక్వెల్ ని రెడీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలు సీక్వెల్స్ మొదలయ్యాయి, మొదలు కాబోతున్నాయి. తాజాగా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న రెండు హారర్ కామెడీ యూనివర్స్‌లో సీక్వెల్స్ ని అనౌన్స్ చేశారు. నిన్న రాత్రి ముంబైలో జియో స్టూడియోస్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లాంచ్ అయ్యింది.
Jio Studios : OTTకి ఎంట్రీ ఇచ్చిన జియో.. ఒకేసారి 100 స్టోరీస్ రిలీజ్.. జియో యూజర్స్‌కి పండగేనా?
ఈ లాంచ్ ఈవెంట్ లో జియో స్టూడియోస్ నిర్మించబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే స్త్రీ, భేడియా చిత్రాలకు సీక్వెల్స్ ప్రకటించారు. హారర్ కామెడీ యూనివర్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాలను దినేష్ విజయన్ నిర్మించాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ తో కలిసి జిఓ స్టూడియోస్ స్త్రీ 2, భేడియా 2 చిత్రాలు నిర్మించబోతున్నారు. కాగా స్త్రీ (Stree) సినిమా 2018 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం 14 కోట్లతో తెరకెక్కి 180 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఇక ఈ సినిమా తరువాత హారర్ కామెడీ యూనివర్స్‌లో రోహి (Roohi) అనే సినిమా వచ్చి జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ యూనివర్స్ లో మూడో సినిమాగా భేడియా (Bhediya) వచ్చింది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం తోడేలు మనిషి కథాంశంతో తెరకెక్కింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని నార్మల్ హిట్టుగా నిలిచింది. మరి హారర్ కామెడీ యూనివర్స్ లో వస్తున్న ఈ సీక్వెల్స్ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయి చూడాలి.
JIO STUDIOS’ GRAND CELEBRATIONS: 1 STUDIO, 100 STORIES, AN UNFORGETTABLE NIGHT… #JioStudios, for the first time, unveiled its spectacular content slate of 100 stories… Hosted by the most-engaging #RiteishDeshmukh along with #JyotiDeshpande [President of RIL Media Business], the… pic.twitter.com/BtHTfx1GJ1
— taran adarsh (@taran_adarsh) April 13, 2023