Jr NTR : అప్పుడే బాలీవుడ్ కల్చర్‌కి అలవాటు పడ్డ ఎన్టీఆర్.. భార్యతో కలిసి బాలీవుడ్ పార్టీలకు.. వీడియోలు వైరల్..

తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.

Jr NTR and His Wife Pranathi Attend Bollywood Dinner Party in Mumbai Videos goes Viral

Jr NTR : బాలీవుడ్(Bollywood) కల్చర్ వేరేగా ఉంటుందని, రెగ్యులర్ గా అక్కడ స్టార్ సెలబ్రిటీలు పార్టీలు చేసుకుంటారని, డిన్నర్స్ కి బయటకి వెళ్తారని అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ కొంచెం ఎక్కువే. బాలీవుడ్ పార్టీ కల్చర్ కి అలవాటు పడకపోతే అక్కడ నెగ్గుకురావడం కష్టమే అని కొంతమంది నటీనటులు బహిరంగంగానే చెప్పారు. దీంతో బాలీవుడ్ లో ఎదగాలంటే అక్కడ సెలబ్రిటీలంతా ఆ పార్టీ కల్చర్ లో భాగమవుతారు.

తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండటంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. తాజాగా నిన్న రాత్రి ఎన్టీఆర్, తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.

Also Read : Kovai Sarala : కోవై సరళ గుర్తుందా? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. చాలా ఏళ్ళ తర్వాత హైదరాబాద్‌లో..

ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి, రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ లు అందరూ కలిసి వచ్చారు. మరింతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్, ప్రణతి, బాలీవుడ్ సెలబ్రిటీల వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లి మహా అయితే రెండు వారాలు అయి ఉంటుంది. గతంలో RRR ప్రమోషన్స్ లో పాల్గొన్నా చరణ్, రాజమౌళితో కలిసి పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అక్కడ సినిమా చేస్తుండటంతో అక్కడి కల్చర్ కి అలవాటు పడుతున్నాడు. బాలీవుడ్ కి వెళ్లిన రెండు వారాల్లోనే భార్యతో కలిసి బాలీవుడ్ సెలబ్రిటీల డిన్నర్ పార్టీకి ఎన్టీఆర్ వెళ్లాడంటే చాలా తొందరగా ఎన్టీఆర్ బాలీవుడ్ జనాల్లో కలిసిపోతాడని అనిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ కి ఆల్రెడీ వార్ 2 తో పాటు అదే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఇంకో సినిమా కూడా ఉందని సమాచారం. ఇప్పుడు అందరితో కలిసిపోయి బాలీవుడ్ కి ఇంత తొందరగా అలవాటు పడ్డాడంటే ఇదే ఊపులో బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు కచ్చితంగా చేసేస్తాడు అని భావిస్తున్నారు. ఇక రెస్టారెంట్ బయట ఎన్టీఆర్, ప్రణతి వీడియోలు బయటకి రావడంతో అభిమానులు వీటిని వైరల్ చేస్తున్నారు.