JR Ntr : ఇంకో ఎన్టీఆర్ ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- October 30, 2024 / 01:26 PM IST
JR Ntr introduced another Nandamuri Taraka Ramarao
JR Ntr : నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా వైవీఎస్ తారక రామారావు ఫస్ట్‌లుక్ రిలీల్ చేశారు. పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగో తరం నటవారసుడు. ఈ క్రమంలో ఆయన ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో పాటు పలువురు ట్వీట్స్ చేశారు.
‘రామ్‌కు ఆల్‌ది బెస్ట్.. ఇది నీ మొదటి అడుగు. సినీ ప్రపంచం మీకు లెక్కలేనన్ని ఆనందక్షణాలను అందజేస్తుంది. మీకు అన్ని విజయాలే దక్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. ‘అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
YVS Chowdary : నందమూరి నాలుగో తరం నటుడిని చూశారా? హరికృష్ణ మనవడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Unstoppable 4 : దుల్కర్ సల్మాన్ ఎంత స్పీడ్‌తో కారు నడుపుతాడో తెలుసా?
‘నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు. మీరు మీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తారని, మీ కెరీర్లో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను.’ అని కళ్యాణ్ రామ్ తెలిపారు.
