YVS Chowdary : నందమూరి నాలుగో తరం నటుడిని చూశారా? హరికృష్ణ మనవడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఆయన ఓ చిత్రం తెరకెక్కుతోంది.

YVS introduce Nandamuri Taraka Ramarao
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. తన కెరీర్‌లో ఎందరో హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. తాజాగా నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
న్యూ ట్యాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన భార్య గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరణవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను పంచుకునేందుకు వైవీఎస్ చౌదరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తారక రామారావు లుక్‌ను రివీల్ చేశారు. పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగవ తరం నటవారసుడు.
Unstoppable 4 : దుల్కర్ సల్మాన్ ఎంత స్పీడ్‌తో కారు నడుపుతాడో తెలుసా?
ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తితో తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. తాను ఈ స్థానంలో ఉండడానికి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమన్నారు. ఎన్టీఆర్ తన మునిమనవడు రూపంలో వచ్చారన్నారు.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల తారకమంత్రం. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది. ఈ తారకరామారావును కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.