NTR 100 Years : ఎన్టీఆర్ శత జయంతి.. తాతకు నివాళులు అర్పించిన మనవడు..

ఇప్పటికే బాలకృష్ణ, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడి వెళ్లారు. బాలకృష్ణ వెళ్లిన కొద్దిసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు విచ్చేసారు

Jr NTR pays tribute to NTR at Hyderabad NTR Ghat

Jr NTR : తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు ఎన్టీఆర్. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది. మే 28 2023కు ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతోంది. తెలుగువారంతా ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శత జయంతి.. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలయ్య..

 

ఇప్పటికే బాలకృష్ణ, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడి వెళ్లారు. బాలకృష్ణ వెళ్లిన కొద్దిసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు విచ్చేసారు. తన తాతకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. నివాళులు అర్పించిన అనంతరం వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వచ్చిన అభిమానులు ఎగబడ్డారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నివాళులు అర్పించడానికి వస్తారు. అయితే ఈ సారి మాత్రం కళ్యాణ్ రామ్ ఇంకా రాలేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు కూడా భారీగా వచ్చారు. ఎన్టీఆర్ చుట్టూ అభిమానులు గుమిగూడారు. బౌన్సర్లు ఉన్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఓ ఎన్టీఆర్ అభిమాని గుండెపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు మురళి. ఎన్టీఆర్ వెళ్లిన అనంతరం ఆయన గుండెపోటుకు గురికాగా హాస్పిటల్ కు తరలించారు.