Jr NTR : జపాన్ భారీ భూకంపం నుంచి జస్ట్ మిస్.. స్పందించిన ఎన్టీఆర్

గత వారం రోజులుగా ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. నిన్న జపాన్ లో భూకంపం రావడంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు అని తెలిసిన వాళ్ళు, అభిమానులు కంగారు పడ్డారు.

Jr NTR Reacted on Japan Earthquake Tweet goes Viral

Japan Earthquake Jr NTR : నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జపాన్(Japan) లోని చాలా ప్రాంతాల్లో భూకంపం(Earthquake) వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ 7 తీవ్రతతో భూకంపం జపాన్ ని వణికించింది. ఈ భూకంపానికి ప్రాణ నష్టం తక్కువే జరిగినా, భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో జపాన్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ న్యూస్ చెప్పారు.

జపాన్ లో మన తెలుగు హీరోలకు అభిమానులు ఎక్కువ అని తెలిసిందే. RRR సినిమాతో చరణ్, ఎన్టీఆర్ లకు కూడా భారీగా అభిమానులు ఏర్పడ్డారు జపాన్ లో. మన స్టార్స్ జపాన్ కి వెళ్లి అక్కడ వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం జపాన్ వెళ్లారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. నిన్న జపాన్ లో భూకంపం రావడంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు అని తెలిసిన వాళ్ళు, అభిమానులు కంగారు పడ్డారు.

Also Read : Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం…ఆరుగురి మృతి

దీంతో ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో.. జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. భూకంపం వార్త విని షాక్ అయ్యాను. గత వారం అంతా జపాన్ లోనే గడిపాను. మేం సేదతీరిన ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలిచివేసింది. అక్కడి ప్రజల దృఢత్వానికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్టే స్ట్రాంగ్ జపాన్ అని నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జపాన్ నుంచి వచ్చేశారు అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య.. జస్ట్ మిస్ అయ్యారు, ఒక్కరోజు లేట్ గా బయలుదేరిన ఎన్టీఆర్ భూకంపంలో చిక్కుకునేవారు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.