Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. 24 మంది మృతి
కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్‌ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల 24 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో ఒక మీటరు మేర అలలు వచ్చాయి....

Japan Earthquake
Japan Earthquake : కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్‌ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల 24 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో ఒక మీటరు మేర అలలు వచ్చాయి. 155 మంది భవన శిథిలాల కింద ఉన్నారని జపాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, జపాన్ స్థానిక అధికారులు కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ భారీ భూకంపం వల్ల పలు ఇళ్లు కూలిపోగా, పదివేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Also Read : Jr NTR : జపాన్ భారీ భూకంపం నుంచి జస్ట్ మిస్.. స్పందించిన ఎన్టీఆర్
సునామీ హెచ్చరికల జారీతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఎతైన ప్రాంతాలకు తరలిపోయారు. జపాన్ పశ్చిమ సముద్ర తీరం, దక్షిణ కొరియాలో మీటరు మేర ఎత్తులో అలలు వచ్చాయి. భూకంపం కారణంగా రన్‌వేపై పగుళ్లు ఏర్పడటంతో స్థానిక విమానాశ్రయాన్ని మూసివేశారు. రెస్క్యూ కార్యకలాపాలకు ఆర్మీ సిబ్బందిని పంపారు. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని షికా టౌన్‌లో భవనం కూలిపోవడంతో వృద్ధుడు మరణించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.
ALSO READ : Kesineni Nani : విజయవాడపై కబంధహస్తం..! కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
రోడ్లు బ్లాక్ చేయడం వల్ల సహాయ సిబ్బంది భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. భూకంపం తర్వాత జపాన్‌కు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో తొమ్మిది ప్రిఫెక్చర్లలో 97,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయమని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. వారంతా స్పోర్ట్స్ హాల్స్, పాఠశాల వ్యాయామశాలల్లో రాత్రి గడిపారు.