×
Ad

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన బామ్మ..

  • Published On : November 11, 2021 / 12:35 PM IST

Bamma Dance

Naatu Naatu Song: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసేశారు. ఈ ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి ఒక పాటలో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది.. ‘నాటు నాటు’ పాటలా ఉంటుంది..

Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !

బుధవారం ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. స్వరవాణి కీరవాణి ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. చంద్రబోస్ అదిరిపోయే లిరిక్స్ రాశారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న కాలభైరవ, యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ కలిసి చాలా చక్కగా, ఎనర్జిటిక్‌గా పాడిన ‘నాటు నాటు’ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

ఇక రీసెంట్‌గా ఈ పాటకు ఓ బామ్మ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాంగ్ ప్లే అవుతుండగా బామ్మ అదిరిపోయే స్టెప్స్ వేశారు. నో ఏజ్ లిమిట్ ఫర్ ఫ్యానిజమ్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో షేర్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.