Jr NTR Speech after receiving best actor award for RRR at SIIMA Awards 2023 Dubai Event goes Viral
NTR Speech : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిన్న సెప్టెంబర్ 15న జరిగాయి. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా నేడు తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుక జరగనుంది. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా తెలుగులో RRR సినిమాకు గాను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. వేదికపై ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ సైమా అవార్డు అందుకున్న అనంతరం కేవలం ఫ్యాన్స్ గురించి మాట్లాడారు.
Gam Gam Ganesha Teaser launch Event : ఆనంద్ దేవరకొండ గం గం గణేశా టీజర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
ఎన్టీఆర్ సైమా అవార్డుల వేదికపై మాట్లాడుతూ.. నా ఒడిదుడుకుల్లో, నేను కిందపడ్డప్పుడల్లా నన్ను పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వారు కూడా కన్నీరు కార్చినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికి పాదాభివందనాలు అని తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Only true @tarak9999 fans can feel his heart touching words about his fans ❤️#SIIMA2023inDubai #ManOfMassesNTR pic.twitter.com/maDwWT55xO
— Meg 'NTR' (@meghanath9999) September 16, 2023