Jr Ntr : వార్ 2 కంటే ముందే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ..! ఏ సినిమాతోనో తెలుసా..?

హృతిక్ రోష‌న్ హీరోగా న‌టిస్తున్న వార్ 2 చిత్రంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమా కంటే ముందుగానే మ‌రో స్టార్ హీరో చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు అక్క‌డి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Jr NTR Bollywood Entry

Jr NTR Bollywood Entry : ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ (Jr NTR) కు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ చిత్రంలోని ఎన్టీఆర్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. హృతిక్ రోష‌న్ (Hrithik Roshan) హీరోగా న‌టిస్తున్న ‘వార్ 2’ (War 2) చిత్రంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే.. ఈ సినిమా కంటే ముందుగానే మ‌రో స్టార్ హీరో చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు అక్క‌డి మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘టైగ‌ర్ 3’. క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ‘టైగ‌ర్ జిందా హై’ కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటుంది. మ‌నీశ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రంలోని క్లైమాక్స్ స‌న్నివేశంలో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని ఆ వార్త‌ల సారాంశం. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి అయ్యింద‌ని టాక్‌. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

దాదాపు 25 నిమిషాల పాటు షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే.. ఎన్టీఆర్ ఎంత సేపు క‌నిపిస్తాడు అన్న విష‌యాలు అయితే తెలియ‌రాలేదు. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది..

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ‘దేవర’ (Devara) సినిమాలో న‌టిస్తున్నాడు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వ‌నుంది. మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఈ సినిమా త‌రువాత వార్ 2 సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన‌నున్నాడు. ఇటీవ‌లే ఎన్టీఆర్‌తో అయాన్ ముఖ‌ర్జీ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చిత్ర షూటింగ్ న‌వంబ‌ర్‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు