Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది.. కొట్టే ముందు కొట్టేసే ముందు..
రవితేజ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Raviteja new movie Tiger Nageswara Rao trailer release
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నూతన దర్శకుడు వంశీ తో కలిసి చేస్తున్న యాక్షన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్రకాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మాస్ మహారాజ్ ని మరింత మాస్ గా చూపించి అదరగొట్టేశారు. ‘కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ రవితేజ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ట్రైలర్ లో అన్ని విషయాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవితేజ అభిమానులకు అయితే ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
కాగా ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ట్రైలర్ చూస్తుంటే.. టైగర్ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల మాత్రమే తీసుకోని ఒక ఫిక్షనల్ స్టోరీని దర్శకుడు రాసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా పై స్టూవర్టుపురంకి చెందిన ప్రజలు, ఎరుకల జాతి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమని కించపరిచే విధంగా సినిమా తీస్తున్నారంటూ కోర్టుని ఆశ్రయించారు. ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు కూడా దిగారు.