డిసెంబర్ 13న ‘జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్’

‘జుమాంజీ : వెల్ కమ్ టు ది జంగిల్’ మూవీకి సీక్వెల్‌‌గా రూపొందిన ‘జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్’ డిసెంబర్ 13న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : November 1, 2019 / 10:09 AM IST
డిసెంబర్ 13న ‘జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్’

Updated On : November 1, 2019 / 10:09 AM IST

‘జుమాంజీ : వెల్ కమ్ టు ది జంగిల్’ మూవీకి సీక్వెల్‌‌గా రూపొందిన ‘జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్’ డిసెంబర్ 13న విడుదల కానుంది..

ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్, జాక్ బ్లాక్, కెవిన్ హార్ట్, కారెన్ గిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అడ్వెంచరస్ థ్రిల్లర్.. ‘జుమాంజీ : ది నెక్ట్స్ లెవల్’.. 2017లో వచ్చిన  ‘జుమాంజీ : వెల్ కమ్ టు ది జంగిల్’ మూవీకిది సీక్వెల్‌.. వీడియో గేమ్ ఆడుతున్న నలుగురు స్టూడెంట్స్‌ను ఆ గేమ్ లోపలికి లాగేసుకుంటుంది..

బయటకి రావాలంటే గేమ్‌లోని రూల్స్ ఫాలో కావాలి.. పలు లెవల్స్ దాటాలి.. ఫస్ట్ పార్ట్ ఫారెస్ట్‌లో సాగితే, సెకండ్ పార్ట్ అడవితో పాటు ఎడారి, మంచుకొండల్లోనూ కొనసాగనుంది. ఫస్ట్ పార్ట్‌ను మించిన యాక్షన్ అండ్ అడ్వెంచరస్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు మూవీ టీమ్ తెలిపింది.

‘వాళ్లు ఆట మొదలు పెట్టారు.. చూడ్డానికి మీరు రెడీనా.. కొత్త ప్రదేశాలు, కొత్త ముఖాలు, కొత్త లెవల్స్ చూడాలనుకుంటున్నారా? అయితే మిమ్మల్లి వాళ్ల ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి డిసెంబర్ 13న వస్తున్నారు’.. అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్.. జేక్ డైరెక్ట్ చేయగా కొలంబియా పిక్చర్స్, సెవన్ బక్స్ ప్రొడక్షన్స్, హార్ట్‌బీట్ ప్రొడక్షన్స్, మాల్ట్ టోల్‌మ్యాచ్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.