Jyothika : అయిదేళ్ల తర్వాత ‘అమ్మ ఒడి’ అంటూ డబ్బింగ్ అవుతున్న జ్యోతిక సినిమా.. ఎన్నికల ముందే రిలీజ్?

జ్యోతిక ముఖ్య పాత్రలో నాలుగేళ్ళ క్రితం వచ్చిన సినిమా రాక్షసి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో 'అమ్మ ఒడి' అనే టైటిల్ తో తీసుకురావడం గమనార్హం.

Jyothika Raatchasi Movie Releasing in Telugu after four Years with Amma Vodi Title

Jyothika : జ్యోతిక ముఖ్య పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై అయిదేళ్ల క్రితం వచ్చిన సినిమా రాక్షసి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ‘అమ్మ ఒడి’ అనే టైటిల్ తో తీసుకురావడం గమనార్హం. వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డిలు ఈ ‘అమ్మ ఒడి’ సినిమాను తెలుగులో త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను మార్చేసే టీచర్ గా జ్యోతిక నటించింది. పాడైపోయిన గవర్నమెంట్ స్కూల్స్ ని బాగుచేయాలని కంకణం కట్టుకున్న టీచర్ పాత్రలో జ్యోతిక అందర్నీ మెప్పించింది. విద్యని భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతికని ఇందులో చూపించనున్నారు. జ్యోతిక పాటు ఈ సినిమాలో నాగినీడు, హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషించారు.

Also Read : Ravi Teja : అందరూ టికెట్ రేట్లు పెంచుతుంటే.. రవితేజ ‘ఈగల్’ మాత్రం పెంచకుండానే

అయితే సినిమాకు అమ్మ ఒడి అని టైటిల్ పెట్టడం, ఎన్నికల టైంలో జగన్ పెట్టిన పథకం పేరుతో సినిమా టైటిల్ పెట్టి ఈ సినిమా తేవడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు