రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న తమిళ సినిమా 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం..
ఒకప్పడు కథానాయికలుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న రేవతి, జ్యోతిక ఇద్దరూ సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వాళ్ళు నటిస్తున్న సినిమా షూటింగ్‌ని కేవలం 35 రోజుల్లో పూర్తి చెయ్యడమే అందుకు ఉదాహరణ.. రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా, గులేబకావళి (2018) ఫేమ్ ఎస్.కళ్యాణ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం రేవతి, జ్యోతిక బైక్స్ నడపడం విశేషం. కేవలం 35 రోజుల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయడం ఆశ్చర్యమే.. జ్యోతిక భర్త సూర్య ఈ సినిమాకి ఒక నిర్మాత..
సూర్య చివరి రోజు షూటింగ్‌కి రావడం, యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో, ఆ పిక్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నారు. యోగిబాబు, మన్సూర్ అలీ, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : విశాల్ చంద్రశేఖర్, కెమెరా : ఆనంద్ కుమార్.