జ్యోతిక, శశికుమార్ ప్రధాన పాత్రధారులుగా శరవణన్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచారు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జ్యోతిక.. రేవతితో కలిసి నటించిన ‘జాక్‌పాట్’ ఇటీవల విడుదలైంది. తాజాగా జ్యోతిక నటించనున్న కొత్త సినిమా ప్రారంభమైంది.
జ్యోతిక, నటుడు, దర్శకుడు శశికుమార్ ప్రధాన పాత్రధారులుగా శరవణన్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
సూర్య, సముద్రఖని, సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2020 వేసవిలో విడుదల చేయనున్నారు. జ్యోతిక, కార్తి అక్కాతమ్ముళ్లుగా నటించిన ‘దొంగ’ డిసెంబర్లో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు.