Raghavendra Rao-Sarkaru Naukari
Raghavendra Rao-Sarkaru Naukari : టాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను తీశారు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(K Raghavendra Rao). ఆయన నిర్మాతగా మారి ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శాంతి నివాసం సీరియల్‌ను నిర్మించారు. ఈ సీరియల్‌తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli)ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ 25 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు తొలిసారి చిత్ర నిర్మాణం చేపట్టారు. ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘సర్కారు నౌకరి’ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా భావనా వళపండల్ కథానాయిక.
Raghavendra Rao in Sarkaru Naukari shooting
Devara : దేవరకు తలనొప్పిగా మారిన ఫ్యాన్స్.. చిత్ర బృందం కీలక నిర్ణయం..!
ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో మూవీ మేకింగ్ ను చూపించారు. దీన్ని జాగ్రత్తగా చూస్తే.. నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తోంది. పలు సూచనలను ఆయన ఇస్తున్నట్లు గమనించవచ్చు. దర్శకుడు గంగనమోని శేఖర్ ఈ సినిమాని ప్లెజంట్ మూవీగా రూపొందించారు. ప్రస్తుతం తుది దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తనికెళ్ల భరణి, మహాదేవ్, మధులత, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి లు కీలక పాత్రల్లో నటించారు.