K Viswanath's Swathi Muthyam is the first telugu movie official sending to Oscars from India
Swathi Muthyam : తెలుగు సినీపరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన మరణంతో మరోసారి టాలీవుడ్ విషాదంలో మునిగింది. తెలుగు సినీ పరిశ్రమకి తన సినిమాల ద్వారా విలువైన బాండాగారాన్ని అందించిన దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన ప్రతి సినిమాకు ఏదో ఒక అవార్డు వచ్చేది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డుని ఆయన సినిమాలు, ఆయన సినిమాల్లో నటించిన వాళ్ళు, ఆయన సినిమాలకు పనిచేసిన వాళ్ళు, ఆయన గెలుచుకున్నారు.
మనం ఇప్పుడు RRR సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో అవార్డులు సాధిస్తుందని మురిసిపోతున్నాం. కాని ఒకప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాయి. అంతర్జాతీయంగా అవార్డులు సాధించాయి. మన RRR సినిమాని ఆస్కార్ లిస్ట్ కి మన దేశం తరపున పంపలేదు అని అంతా అనుకున్నారు. కాని కొన్ని సంవత్సరాల క్రితమే మన తెలుగు సినిమా ఆస్కార్ క్వాలిఫై లిస్ట్ కి అధికారికంగా భారతదేశం నుంచి వెళ్ళింది. అది కూడా కె.విశ్వనాథ్ గారి సినిమా.
కె.విశ్వనాథ్ 1985లో దర్శకత్వం వహించిన సినిమా స్వాతిముత్యం. కమల్ హాసన్, రాధికా కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. లోక నాయకుడైన కమల్ హాసన్ ఈ సినిమాలో కూడా చాలా సెటిల్డ్ గా ఓ మైండ్ ఎదగని మనిషిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా ఎన్నో అవార్డులని కూడా అందుకుంది. స్వాతిముత్యం సినిమా భారతదేశం తరపున 59వ అకాడమీ అవార్డులకు బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరిలో పంపించారు. ఇలా ఆస్కార్ కి అధికారికంగా వెళ్లిన ఏకైక తెలుగు సినిమా స్వాతిముత్యం. ఇప్పుడు అందరూ RRR తో ఆస్కార్ కళలు కంటున్నారు. కాని డైరెక్టర్ కె.విశ్వనాథ్ అప్పుడే ఆయన సినిమాలతో ఆస్కార్ కలలు కనేలా చేశారు.