డిస్నీ సంస్థ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’.. లో ప్రధాన పాత్రలకు అగర్వాల్ సిస్టర్స్.. కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ తెలుగులో డబ్బింగ్ చెప్పనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం..
టాలీవుడ్ బ్యూటీస్.. అగర్వాల్ సిస్టర్స్.. కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ కలిసి ఫస్ట్ టైమ్ ఓ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.. వీరిద్దరూ కలిసి నటించడం లేదు కానీ.. ఓ హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్ కోసం అక్కాచెల్లెళ్లిద్దరూ తమ వాయిస్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. హిందీలో చోప్రా సిస్టర్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా మెయిన్ క్యారెక్టర్స్‌కి వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
2013లో వచ్చిన పాపులర్ యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా.. దాదాపు అదే టీమ్‌తో డిస్నీ సంస్థ ‘ఫ్రోజెన్ 2’.. నిర్మించింది. క్రిస్ బక్ అండ్ జెన్నిఫర్ లీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ‘ఇదియా మెజెల్’ పోషించిన ‘ఎల్సా’ క్యారెక్టర్‌కు కాజల్, ‘క్రిస్టెన్ బెల్’ చేసిన ‘అన్నా’ క్యారెక్టర్‌కు నిషా తెలుగులో డబ్బింగ్ చెప్పనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుండగా.. నిషా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ‘ఫ్రోజెన్ 2’ నవంబర్ 22న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.