Kajal
Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకుంది. ఇక ప్రెగ్నెన్సీ రావడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి హెల్త్ మీద మరింత కాన్సంట్రేట్ చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన పోస్టులు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే పోస్టులు కూడా పెడుతూ సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది కాజల్. తాజాగా తను ఏరోబిక్స్ చేసిన ఓ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్
ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్ సైజులు చేయాలంటూ, ఏరోబిక్స్ చేయాలంటూ కాజల్ తన ట్రైనర్ తో కలిసి చేసిన ఓ ఏరోబిక్స్ వీడియోని షేర్ చేసి.. ”నేను నా లైఫ్ మొత్తం చాలా చురుకుగా ఉంటాను. చాలా యాక్టీవ్ గా పని చేశాను. కానీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. గర్భంతో ఉన్న మహిళలంతా తమ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన రోజు వారిలో భాగంగా ఏరోబిక్స్ మరియు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఇలాంటి ఏరోబిక్స్ చేయడం వాళ్ళ నా శరీరం మరింత మెరుగ్గా తయారయింది. ఇలాంటి ఎక్సర్ సైజులు చేయడం వల్ల నాకు మరింత బలం చేకూరినట్లు అనిపిస్తుంది. గర్భధారణ సమయంలో ఏరోబిక్స్ చేయాలి కానీ మరీ ఎక్కువగా చేయకూడదు, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి” అని పోస్ట్ చేసింది.