Kajal Aggarwal : భగవంత్ కేసరి నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కాజల్ బర్త్‌డే కానుకగా..

తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కాజల్............

Kajal Aggarwal first look from Bhagavanth Kesari released on her birthday

Bhagavanth Kesari :  అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య(Balayya) హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) బాలయ్యకు జోడిగా నటిస్తోంది. శ్రీలీల(Sreeleela), శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయి మరిన్ని అంచనాలు పెంచింది.

ఇటీవల శ్రీలీల పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కాజల్ ఫోన్ మాట్లాడుతూ, బుక్ చదువుతూ ఉంది. ఈ సినిమాలో కాజల్ బాలయ్యకు జోడిగా నటిస్తుంది. వీరిద్దరి కాంబోలో ఇది మొదటి సినిమా.

Sitara : మహేష్ తో ఎంత క్యూట్ ఫోటోలు షేర్ చేసిందో సితార..

ఇక ఇప్పటికే కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలను ప్రకటిస్తుంది. నేడు కాజల్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.