Kajol – Revathi : రేవతి దర్శకత్వంలో కాజోల్
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రేవతి - కాజోల్ కలిసి హిందీలో ఓ సినిమా చెయ్యబోతున్నారు..

Revathi Kajol
Kajol – Revathi: ఒకప్పటి స్టార్ హీరోయిన్స్.. ఇప్పటి సీనియర్ నటీమణులు కాజోల్, రేవతి కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నారు. రేవతి నటిగానే కాకుండా దర్శకురాలిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశారు రేవతి.
Ali Reza wife : అలీ రెజా భార్య సీమంతం.. తరలి వచ్చిన తారలు..
సీనియర్ నటి, క్లాసికల్ డ్యాన్సర్ శోభన ప్రధాన పాత్రలో 2002లో Mitr, My Friend అనే ఇంగ్లీష్ ఫిలింతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పా శెట్టి మెయిన్ లీడ్స్‌గా.. Phir Milenge మూవీతో ప్రశంసలందుకున్నారు.
Adipurush : షూటింగ్ పూర్తి చేసిన సైఫ్ అలీ ఖాన్..
మలయాళంలో సూపర్ స్టార్స్ మమ్ముట్టి, సురేష్ గోపి, దిలీప్ తదితరులు నటించిన Kerala Cafe అనే ఆంథాలజీ సిరీస్ తెరకెక్కించారు (ఈ సిరీస్‌కి పదిమంది దర్శకత్వం వహించడం విశేషం). తర్వాత Mumbai Cutting అనే మరో డిఫరెంట్ ఆంథాలజీ సిరీస్ చేశారు. దర్శకురాలిగా దాదాపు పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు.

ఇటీవల జ్యోతికతో కలిసి ‘జాక్‌పాట్’ సినిమాలో అలరించిన రేవతి ఇప్పుడు కాజోల్ ప్రధాన పాత్రలో.. సూరజ్ సింగ్, శ్రద్ధా అగర్వాల్ నిర్మాతలుగా హిందీలో ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఈ మూవీకి The Last Hurrah అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేవతి డైరెక్ట్ చేస్తున్న ఫిఫ్త్ ఫిల్మ్ ఇది. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
