Children’s Day 2024 : టాలీవుడ్ స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోలు షేర్ చేసిన కల్కి డైరెక్టర్.. ప్రభాస్ టు కమల్..
ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమా చేస్తున్న నాగ్ అశ్విన్ కూడా విషెస్ తెలియజేస్తూ.. తన దర్శకత్వంలో నటించిన స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేశారు.

Kalki 2898 AD director Nag Ashwin shares Prabhas Kamal Haasan Childhood photos
Children’s Day 2024 : నేడు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే కావడంతో టాలీవుడ్ స్టార్స్ విషెస్ తెలియజేస్తూ.. తమ పిల్లల ఫోటోలను, మరికొందరు స్టార్స్ అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే హీరో నాని తన కొడుకు అర్జున్ తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమా చేస్తున్న నాగ్ అశ్విన్ కూడా విషెస్ తెలియజేస్తూ.. తన దర్శకత్వంలో నటించిన స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నుంచి కమల్ హాసన్ వరకు వారి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు.
నాగ్ అశ్విన్ ని దర్శకుడిగా పరిచయం చేసిన నాని, మహానటిలో నటించిన కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ఇప్పుడు కల్కిలో నటిస్తున్న ప్రభాస్, కమల్ హాసన్ చిన్నప్పటి ఫోటోలను నాగ్ అశ్విన్ షేర్ చేస్తూ చిల్డ్రన్స్ డే విషెస్ తెలియజేశారు. మరి మీ ఫేవరెట్ స్టార్ హీరోల క్యూట్ పిక్స్ ని మీరుకూడా ఒకసారి చూసేయండి.
Also read : HanuMan : తెలుగు సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది..
View this post on Instagram
ఇక ప్రభాస్ కల్కి విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మోడరన్ టెక్నాలజీ, హిందూ సనాతన ధర్మాన్ని కలుపుతూ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
వీరితో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారట. 2024 సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ.. గ్రాఫిక్స్ విషయంలో లేటు అవ్వడంతో పొంగల్ బరిలో నుంచి తప్పుకుంది. ప్రభాస్ గత సినిమాలు రాధేశ్యామ్, ఆదిపురుష్ విషయాల్లో జరిగిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో జరగకూడదని దర్శకుడు నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి.