Kalki : చిన్నారుల‌కు అద్భుత అవ‌కాశం.. ప్ర‌భాస్ ‘బుజ్జి’ని క‌లుసుకునే గోల్డెన్ ఛాన్స్‌..

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD'.

Kalki team given Golden chance to children on november 14th

Kalki : ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించ‌గా.. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

థియేట‌ర్ల వ‌ద్ద ఈ మూవీ కాసుల వ‌ర్షం కురిపించింది. వెయ్యి కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Gopal Varma : రామ్‌గోపాల్‌కు వ‌ర్మకు నోటీసులు.. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారంటూ..

ఇదిలా ఉంటే..ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఉప‌యోగించిన బుజ్జి వాహ‌నం ప్ర‌త్యేక‌తే వేరు. ఈ మూవీ కోసం దీన్ని స్పెష‌ల్‌గా డిజైన్ చేశారు. ఈ చిత్ర విడుద‌ల స‌మ‌యంలో ప‌లు ప్రాంతాల్లో బుజ్జితో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ ప‌డ్డారు.

తాజాగా న‌వంబర్ 14న‌ చిల్డ్ర‌న్స్ డేను పుర‌స్క‌రించుకుని చిన్నారులకు అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది క‌ల్కి బృందం. న‌వంబ‌ర్ 14న హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ మ‌ల్టీపెక్స్ వ‌ద్ద బుజ్జి వాహ‌నాన్ని ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది. అక్క‌డ చిన్నారులు బుజ్జిని క‌లుసుకోవ‌చ్చున‌ని చెప్పింది. ‘ఈ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మా #బుజ్జిని కలవడానికి మీ చిన్నారులను తీసుకురండి.’అని సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది.

Lokesh Kanagaraj : బాలీవుడ్ మీద కన్నేసిన లోకేష్ కనగరాజ్!