Lokesh Kanagaraj : బాలీవుడ్ మీద కన్నేసిన లోకేష్ కనగరాజ్!

లోకేశ్‌ కనగరాజ్‌. ఈ డైరెక్టర్‌ పేరు వింటే చాలు మంచి సబ్జెక్ట్‌తో పాటు హీరోలకు ఇచ్చే ఎలివేషన్‌ గుర్తుకు వస్తుంది.

Lokesh Kanagaraj : బాలీవుడ్ మీద కన్నేసిన లోకేష్ కనగరాజ్!

Aamir Khan Collaboration With Lokesh Kanagaraj

Updated On : November 13, 2024 / 10:12 AM IST

Gossip Garage : లోకేశ్‌ కనగరాజ్‌. ఈ డైరెక్టర్‌ పేరు వింటే చాలు..మంచి సబ్జెక్ట్‌తో పాటు హీరోలకు ఇచ్చే ఎలివేషన్‌ గుర్తుకు వస్తుంది. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు కోలీవుడ్‌ టాక్. బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో లోకేశ్‌ కనగరాజ్ సినిమా కన్ఫర్మ్ అయ్యిందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చేయబోతున్నట్లు టాక్.

అమీర్‌ఖాన్‌, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం కొద్ది రోజులుగా నిర్మాత, హీరో, డైరెక్టర్ మధ్య టాక్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్‌గా దీనిపై ప్రకటన చేయొచ్చని అంటున్నారు. అయితే ఈ సినిమా 2026లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అమీర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.

Varun Tej : మ‌ట్కా టీమ్‌తో క‌లిసి తిరుమ‌ల‌లో వ‌రుణ్‌తేజ్ సంద‌డి

ఈ లోపు లోకేశ్‌ కూలీ సినిమా కంప్లీట్ చేస్తాడట. ఆ తర్వాత అమీర్ ఖాన్‌తో సినిమా స్టార్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కితే మాత్రం కచ్చితంగా 2వేల కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దంగల్ సినిమాతో అమీర్ ఖాన్ ఇప్పటికే 2వేల కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరాడు. ఈ నెంబర్‌ని ఇప్పటివరకు ఎవరూ బీట్ చేయలేదు.

లోకేశ్‌తో అమీర్ చేయబోయే మూవీతో..ఆయనకు మళ్లీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే అవకాశం దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం లోకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ మూవీలో కూడా అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Chiranjeevi : మన తెలుగు ఆర్టిస్టులు అంటే మనోళ్లకు లోకువ.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..