Aditi Arya : ఇండియన్ బిలియనీర్‌తో కళ్యాణ్ రామ్ హీరోయిన్ పెళ్లి..

కళ్యాణ్ రామ్ తో కలిసి ఇజం సినిమాలో కలిసి నటించిన హీరోయిన్ అదితి ఆర్య.. ఇండియన్ బిలియనీర్‌తో కలిసి ఏడడుగులు వేయబోతుంది.

Kalyan Ram heroine Aditi Arya engaged with Kotak Mahindra Bank heir Jay Kotak

Aditi Arya : 2015 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న అదితి ఆర్య ఇండియన్ బిలియనీర్‌ని పెళ్లాడబోతుంది. మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అదితి ఆర్య.. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన ‘ఇజం’ (Ism) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా మూవీలు చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. చివరిగా 2021 లో రిలీజ్ అయిన బాలీవుడ్ ’83’ నటించింది. మళ్ళీ అప్పటి నుంచి మరో సినిమాలో కనబడని ఈ భామ.. తాజాగా గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంటూ కనిపించింది.

Salman Khan : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ని పక్కకి నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్!

ప్రముఖ యేల్ యూనివర్శిటీలో తన MBA పూర్తి చేసి గ్రాడ్యుయేట్ పట్టాని అందుకుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) వారసుడు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్, అదితికి అభినందనలు తెలియజేస్తూ.. “నాకు కాబోయే భార్య అదితి, ఈ రోజు యేల్ యూనివర్శిటీలో తన MBA పూర్తి చేసింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు.

Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక అదితి తనకి కాబోయే భార్య అంటూ ప్రకటించడంతో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే గత సంవత్సరంలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద వీరిద్దరూ కలిసి పోజులివ్వడంతో నెట్టింట వీరిద్దరి నిశ్చితార్థం వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అప్పుడు ఎవరు స్పందించకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తో వీరిద్దరూ నిశ్చితార్థాన్ని కన్‌ఫార్మ్ చేసేశారు. మరి ఇద్దరు కలిసి ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారు అన్న దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.