Kalyan Ram – Vijayashanthi : నందమూరి కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమా ‘టైటిల్’ అనౌన్స్.. మళ్ళీ ఖాకీ వేసిన విజయశాంతి

ఇందులో విజయశాంతి - కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు.

Kalyan Ram Vijayashanthi NKR 21 Movie Title Announced

Kalyan Ram – Vijayashanthi : నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. ఓ పక్క హీరోగా చేస్తూ మరో పక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తన తర్వాతి సినిమా NKR 21 ప్రకటించి ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

Also Read : Dhee : కన్నప్ప వచ్చేముందు ‘ఢీ’ కొట్టబోతున్న మంచు విష్ణు.. ‘ఢీ’ రీ రిలీజ్ ఎప్పుడంటే..

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా అలనాటి హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో విజయశాంతి – కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ప్రకటించారు. దీంతో టైటిల్ అదిరింది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

గతంలో విజయశాంతి కమర్షియల్ హీరోయిన్ గానే కాక పవర్ ఫుల్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసిన సంగతి తెలిసిందే. అందులో వైజయంతి ఐపీఎస్ ఒకటి. ఆ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అని పెట్టడం, పోస్టర్ లో విజయశాంతి పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో సినిమాలో విజయశాంతి కూడా పోలీసాఫీసర్ అని, ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ కూడా పోలీస్ గా నటించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో కళ్యాణ్ రామ్ సినిమా వైజయంతి సినిమాకు సీక్వెలా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.