Kalyani Priyadarshan : సైలెంట్ గా అన్నయ్య పెళ్లి చేసేసిన హీరోయిన్.. మరి ఈ భామ పెళ్లి ఎప్పుడో..

కళ్యాణి ప్రియదర్శన్ అన్నయ్య సిద్దార్థ్ ప్రియదర్శన్ వివాహం మెర్లిన్ అనే అమ్మాయితో ఘనంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఫిబ్రవరి 3న జరిగింది. చాలా తక్కువమంది మధ్యలో ఈ వివాహం చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల మధ్య మాత్రమే...............

Kalyani Priyadarshan brother siddarth priyadarshan marriage happened with merlin in Chennai

Kalyani Priyadarshan : ఇటీవల సెలబ్రిటీల పెళ్లిళ్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వాళ్ళ అన్నయ్య రిషబ్ హెగ్డే వివాహం ఘనంగా జరిగింది. అన్నయ్య పెళ్ళిలో పూజా సందడి చేసింది. తాజాగా మరో హీరోయిన్ అన్నయ్య పెళ్లి జరిగింది. తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాలతో కూడా తెలుగులో బోలెడంత మంది అభిమానులని సంపాదించుకుంది కళ్యాణి.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పోస్టులు చేస్తుంది ఈ మలయాళీ భామ. ఇటీవల తన అన్నయ్య వివాహం జరిగింది. కళ్యాణి ప్రియదర్శన్ అన్నయ్య సిద్దార్థ్ ప్రియదర్శన్ వివాహం మెర్లిన్ అనే అమ్మాయితో ఘనంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఫిబ్రవరి 3న జరిగింది. చాలా తక్కువమంది మధ్యలో ఈ వివాహం చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహం జరిగినట్టు సమాచారం. ఇక కళ్యాణి నాన్న ప్రియదర్శన్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని తెలిసిందే. అయినా కళ్యాణి అన్నయ్య పెళ్ళికి సినీ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది హాజరయ్యారు.

Sidharth-Kiara : జైసల్మీర్ కి క్యూ కడుతున్న బాలీవుడ్.. సైలెంట్ గా సిద్దార్థ్ – కియారా పెళ్లి..

కళ్యాణి అన్నయ్య సిద్దార్థ్ వివాహంలో ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణి తన ఫ్యామిలీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పింది. దీంతో అన్నయ్య పెళ్లి అయిపొయింది మరి నువ్వెప్పుడూ చేసుకుంటావు అని కళ్యాణిని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు