Kalingaraju : ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. పీరియాడిక్ యాక్షన్ డ్రామానా..!

'నాటకం' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ.. మరోసారి చేతులు కలిపి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘కళింగరాజు’.

Kalyanji Gogana Ashish Gandhi new movie Kalingaraju first look

Kalingaraju : ‘రంగస్థలం’ సినిమా తరువాత నుంచి టాలీవుడ్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీస్ కి ఆదరణ బాగా పెరిగింది. బిఫోర్ 20’s నేపధ్య సినిమాల పై ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా అలాంటి కథలని సిద్ధం చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా ‘నాటకం’ మూవీ కాంబినేషన్ కూడా తమ కొత్త సినిమాని అదే నేపథ్యంలో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

2018లో యాక్షన్ థ్రిల్లర్ వంటి ‘నాటకం’ సినిమాతో వచ్చి మంచి సక్సెస్ నే అందుకున్న దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ.. మరోసారి చేతులు కలిపి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘కళింగరాజు’. పవర్ ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో ఆశిష్ గాంధీ గుబురు గడ్డంతో, లుంగీతో ఓ కుర్చీ మీద కూర్చొని, రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు.

Also read : Vishwak Sen : సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్.. ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్.. వీడియో వైరల్

పోస్టర్ డిజైన్ చూస్తుంటే.. పీరియాడిక్ యాక్షన్ డ్రామానా అని సందేహం కలుగుతుంది. మరి మొదటి మూవీతో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్.. ఈ మూవీతో ఎలా అలరిస్తారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల రిలీజై సూపర్ హిట్టు సాధించిన 90s వెబ్ సిరీస్‌కి సంగీతం అందించింది సురేష్ బొబ్బిలినే. ఆ సిరీస్ లోని మ్యూజిక్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ మూవీకి తన సంగీతంతో ఎలా ప్లస్ అవుతారో చూడాలి. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.