Vishwak Sen : సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్.. ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్.. వీడియో వైరల్
సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్ వద్ద నుంచి ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్. వీడియో వైరల్..

Gaami Star Vishwak Sen teasing his fans at tirumala
Vishwak Sen : మాస్ దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా ‘గామి’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. చాందిని చౌదరి, అభినయ, ఉమా, మహమ్మద్ సమద్ పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ట్రైలర్ అండ్ టీజర్ తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అండ్ టేకింగ్ చూపించడంతో మూవీ పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
దానికి తగ్గట్లే సినిమా కూడా థియేటర్స్ లో సరికొత్త కాన్సెప్ట్, స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ హిట్టు అనిపించుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు బాట పట్టింది. దీంతో మూవీ టీం ఫుల్ ఖుషిలో ఉంది. ఈ ఆనందంలోనే విశ్వక్ సేన్, చాందిని చౌదరి అండ్ టీం తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఇక అక్కడ విశ్వక్, చాందిని చూసిన ఆడియన్స్ సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు.
Also read : Allu Arjun : అల్లు అర్జున్ పాటకి హాలీవుడ్ పాప్ సింగర్ డాన్స్.. వీడియో వైరల్
ఈక్రమంలోనే కొందరు యువకులు విశ్వక్ తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా.. విశ్వక్ వారి చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు. ఆ అభిమాని తన ఫోన్ ఇవ్వమని అడుగుతుంటే.. ‘నాకు గిఫ్ట్ గా ఇచ్చానని అనుకో’ అంటూ కాసేపు అతడిని ఆట పట్టించారు. ఆ తరువాత మరో అభిమాని ఫోన్ ని కూడా అలాగే లాగేసుకున్నారు. అయితే చివరికి మళ్ళీ ఆ ఫోన్స్ ని వారికీ తిరిగి ఇచ్చేసారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గామి సినిమా హీరో విష్వక్ సేన్, హీరోయిన్ చాందిని చౌదరి, దర్శకుడు విద్యాధర్ కాగిత.#GAAMI #VishwakSen #ChandiniChowdary pic.twitter.com/PHRMul5xyl
— Gulte (@GulteOfficial) March 13, 2024
ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు 22 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయ్యిపోవడంతో.. ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు బాట పట్టారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు కూడా లేవు. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.